రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజలే గుణపాఠం చెప్తారని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. శుక్రవారం బాసర త్రిబుల్ ఐటీ ముందు తమను రెగ్యులరైజ్ చేయాలని ధర్నా చేస్తున్న కాంటాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు సంఘీభావం తెలిపారు. ఆయన మాట్లాడారు. జీవో 21 వల్ల సంవత్సరాల తరబడి పని చేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఉద్యోగ భద్రతకు ముప్పు వాటిల్లుతుందన్నారు.