ఆర్జీయూకేటీ బాసరలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డి)గా ప్రొఫెసర్ మురళీ దర్శన్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతల స్వీకరణ తదనంతరం ఓఎన్డీ ప్రొఫెసర్ మురళీ దర్శన్ మాట్లాడుతూ యూనివర్సిటీ విజన్ ని సాధించేందుకు అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులతో కలిసి పని చేస్తానని ఆకాంక్షించారు. నూతన బాధ్యతలు స్వీకరించిన ప్రొఫెసర్ మురళీ దర్శన్ కు అధ్యాపకులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.