బాసరలో ముదురుతున్న బీజాక్షరాల వివాదం

77చూసినవారు
బాసర జ్ఞాన సరస్వతి దేవి క్షేత్రంలో బీజాక్షరాల వివాదం ముదురుతోంది. అక్షరాభ్యసం కోసం వచ్చే చిన్నారుల నాలుకలపై స్థానిక ప్రైవేటు వేద పాఠశాలలో బీజాక్షరాలు రాస్తుండడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీనిని ఖండిస్తూ బుధవారం సరస్వతి అనుష్టాన పరిషత్ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకొని అమ్మవారి ప్రతిష్ఠను కాపాడాలని ఆలయ ఈఓ కు వినతిపత్రం అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్