బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. శుక్రవారం మాఘ మాసం, దశమి రోహిణి నక్షత్రం కావడంతో తెల్లవారు జామునుండే భక్తులు ఆలయానికి బారులు తీరారు. ముందుగా గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకొని తమ పిల్లలకు తల్లిదండ్రులు అక్షరాభ్యాసాలు, శ్రీకర, కుంకుమార్చన పూజలు జరిపించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.