బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం మాఘ మాసం దశమి రోహిణి నక్షత్రం పురస్కరించుకొని భారీగా అక్షరాభ్యాస పూజలు నమోదయ్యాయి. మొత్తం 987 మంది చిన్నారులు అక్షర శ్రీకారం జరిపించుకున్నారు. రూ. 1000 టోకెన్ తో 687, రూ. 150 టికెట్తో 150 చిన్నారులకు అక్షరాభ్యాసం జరిగింది. వివిధ పూజ టికెట్ల విక్రయాలతో ఒక్కరోజే రూ. 12, 27, 575 ఆదాయం సమకురినట్లు అధికారులు తెలిపారు.