బాసర: ఐదవ రోజు కళ్ళకు గంతలు కట్టుకొని నిరసన

84చూసినవారు
బాసర త్రిబుల్ ఐటీ 73 మంది కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు క్రమబద్ధీకరణకు డిమాండ్ చేస్తున్న నిరసన ఐదవ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా ఆదివారం కళ్లకు గంతలు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. అన్ని అర్హతలు ఉన్న తమని రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపేందర్, కృష్ణ ప్రసాద్, ఖలీల్, రవికుమార్, శంకర్, విట్టల్, రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్