వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తత అవసరమని నర్సాపూర్ (జి) ప్రభుత్వాసుపత్రి వైద్యులు డాక్టర్ రాకేశ్ అన్నారు. గురువారం లోకేశ్వరం మండలంలోని రాజూర గ్రామ ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే వ్యాధులు రావని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం గోదావరి, ఆశా కార్యకర్తలు, పంచాయతీ కార్య దర్శి మహేశ్, సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు.