లోకేశ్వరం మండలానికి చెందిన పలువురు అధికారులకు జిల్లా స్థాయిలో ఉత్తమ సేవ పురస్కారాలు లభించాయి. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం నిర్మల్ జిల్లా కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ఫైనాన్స్ కమీషన్ ఛైర్మన్ సిరిసిల్ల రాజయ్య లోకేశ్వరం మండల ఎంపీడీఓ సోలమన్ రాజ్, ఎస్ఐ సక్రియా నాయక్ ఉత్తమ సేవ అవార్డులను అందజేశారు.