ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ సూచించారు. శుక్రవారం ఆయన భైంసా ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేసిన సందర్భంగా మాట్లాడారు. 32 మంది డాక్టర్లు ఉన్న ఆసుపత్రిలో రోగులకు వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవల పై విభాగల వారీగా డాక్టర్ లను అడిగి తెలుసుకున్నారు.