బైంసా ఎఎస్పీ క్యాంప్ కార్యాలయంలో బుధవారం గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల పాల్గొని బైంసా సబ్ డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫోన్ల ద్వారా బాధితులకు చట్టపరంగా అందాల్సిన సహాయాన్ని అందిస్తూ వారి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.