బైంసా పట్టణంలోని ప్రభుత్వ భూములను కాపాడాలని మాజీ కౌన్సిలర్ ఫ్లోర్ లీడర్ కపిల్ భైంసా ఆర్డీవో కార్యాలయంలో అధికారులకు మంగళవారం వినతిపత్రం అందజేశారు. పట్టణంలోని ప్రభుత్వ, దేవాలయాల భూములను ఎల్ ఆర్ ఎస్ పేరుతో అధికారులు ఫీజు వసూలు చేస్తూ అక్రమ రిజిస్ట్రేషన్ లు చేస్తున్నారని ఆరోపించాడు. ఇందుకు అనుకూలంగా పనిచేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోని ఆ భూముల రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.