భైంసా: ఎమ్మెల్యే పై దుష్ప్రచారం చేస్తే ఊరుకునేది లేదు

67చూసినవారు
ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్న ఎమ్మెల్యే రామారావు పటేల్ పై, బీజేపీ పార్టీపై దుష్ప్రచారం చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని భైంసా పట్టణ అధ్యక్షులు మల్లేష్, కౌన్సిలర్లు నాయకులు హెచ్చరించారు. సోమవారం భైంసాలోని ఎమ్మెల్యే నివాసంలో పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటున్న ఎమ్మెల్యేను పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు.

ట్యాగ్స్ :