భైంసా: దగ్ధమైన మొక్కజొన్న పంట పొలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

82చూసినవారు
బైంసా మండలంలోని మహాగాం గ్రామంలో కారాగారి సాయినాథ్ అనే రైతుకు చెందిన రెండు ఎకరాల మొక్క జొన్న పంట విద్యుత్ తీగల వల్ల అగ్నికి అహుతి అయింది. దీంతో బాధిత రైతుకు లక్ష రూపాయల వరకు నష్టం జరిగింది. మంగళవారం ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ గ్రామానికి చేరుకుని పంట నష్టాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. రైతుకు ప్రభుత్వం ద్వారా ఆదుకునేందుకు చర్యలు చేపడతామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్