భైంసా పట్టణంలోని లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం పద్మావతి శ్రీనివాసుల కళ్యాణ మహోత్సవం వైభవోపేతంగా జరిగింది. కళ్యాణ మహోత్సవంలో ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో చేపట్టిన కళ్యాణ ఘట్టం కమనీయంగా కొనసాగింది. ఉదయం పుర వీధుల్లో స్వామివారిని, పద్మావతి అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు.