భైంసా పట్టణ కేంద్రంలో గురువారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇథనాల్ పరిశ్రమను రద్దు చేయాలని చేపట్టిన నిరసనకు సీఎం రేవంత్ రెడ్డి స్పందించి పరిశ్రమను రద్దు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. రైతుల బాధలు అర్థం చేసుకున్న సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. భైంసా మార్కెట్ చెర్మెన్ అనంద్ రావు పటేల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.