కుల వృత్తుల వారిని ప్రోత్సహించాలని ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. శుక్రవారం భైంసాలో కుమ్మరి జాగృతి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ప్లాస్టిక్ వ్యర్థాలను అరికట్టడానికి కుమ్మరి కులవృత్తుల వారు తయారు చేసిన మట్టి వస్తువులను వాడాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా మట్టి కుండలు తయారు చేసే ఎలక్ట్రానిక్ మిషిన్లు పంపిణీ చేశామన్నారు.