భైంసా పట్టణంతో పాటు డివిజన్ పరిధిలోని ఆయా గ్రామల్లో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. ఈదురుగాలులు వీయడంతో అధికారులు అక్కడక్కడ ముందస్తుగా కరెంట్ సరఫరా నిలిపివేశారు. మరో వైపు వర్షం కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.