భైంసా: ఘనంగా సంకటహర చతుర్థి పూజలు

74చూసినవారు
భైంసా పట్టణంలోని గణపతి దేవాలయంలో సంకటహర చతుర్థి పూజలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి ఆలయంలో వేదపండితులు శాస్త్రోక్తంగా అభిషేకం, ప్రత్యేక పూజలు, హారతి, మంత్ర పుష్పం నిర్వహించారు. ఉదయం నుండే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. సంకటహర చతుర్థి రోజు గణపతి దేవునికి పూజలు చేస్తే సకల కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్