భైంసా పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలను శుక్రవారం వైభవంగా నిర్వహిస్తున్నారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని వేకువజాము నుండే భక్తులు క్యూలైన్లలో వేచిఉండి స్వామి వారిని దర్శించుకున్నారు. ఉత్తర ద్వారం ద్వారా స్వామి వారిని దర్శించుకుని మొక్కులను చెల్లించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.