బాసర గోదావరిలో గుర్తుతెలియని యువతి మృతదేహం లభ్యం

65చూసినవారు
బాసర గోదావరి నది పుష్కర ఘాట్ వద్ద ఓ గుర్తుతెలియని యువతి మృతదేహం లభించినట్లు గురువారం ఎస్ఐ గణేష్ తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటన స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. మృతురాలి వద్ద ఉన్న బ్యాగులో మూడువేల రూపాయల నగదు, బంగారు గొలుసు, మెట్రో ఐడి కార్డు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతురాలి ఆచూకీ ఎవరికైనా తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్