కుభీర్ లోకేశ్వరం మండలంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి డబ్బులతో ఉడాయించి మోసం చేసిన మహిళా ఉత్పత్తిదారుల సంఘం కంపెనీ సీఈవో శ్రీనివాసు పోలీసులు అరెస్టు చేశారు. ఏఎస్పీ అవినాష్ ఇందుకు సంబంధించిన పట్టణ ఏఎస్పి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏఎస్పి మాట్లాడుతూ 39 మంది రైతులకు రూ. 54 లక్షలు ఇవ్వకుండా పారిపోగా కేసు నమోదు చేశారు. శుక్రవారం శ్రీనివాసును పార్డి(బీ) వద్ద పట్టుకుని రూ. 9 లక్షలు రికవరీ చేసి రిమాండు పంపామన్నారు.