నిర్మల్ జిల్లా భైంసా మార్కెట్లో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. శనివారం ప్రైవేటు పత్తి ధర రూ. 7, 500, సీసీఐ పత్తి ధర రూ. 7, 521 ఉన్నట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. శుక్రవారంతో పోలిస్తే ప్రైవేటు, సీసీఐలో ధరల్లో ఎలాంటి మార్పు లేదన్నారు. కనీస మద్దతు ధర 10 చెల్లిస్తే గిట్టుబాటు అవుతుందని రైతులు కోరుతున్నారు.