భారీ వర్షాలకు దెబ్బతింటున్న పంటలు

66చూసినవారు
ముథోల్ నియోజకవర్గంలోని ఆయా గ్రామాలలో వారం రోజుల్లోగా కురుస్తున్న భారీ వర్షాలకు పంటలు దెబ్బతింటున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. నిరంతరంగ కురుస్తున్న వర్షాలతో పత్తి, సోయ, తదితర పంటలకు తెగుళ్లు సోకి ఎండిపోతున్నాయి. ఆరుగాలం శ్రమించే రైతులకు వర్షాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ అధికారులు పంటల సస్యరక్షణ చర్యలపై రైతులకు అవగాహన కల్పించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్