బాసర గోదావరి నదిలో యాత్రికుల మృతిపై జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ విచారం వ్యక్తం చేశారు. ఆదివారం ఆమె విడుదల చేసిన ప్రకటనలో హైదరాబాద్‌కి చెందిన భక్తులు బాసర దేవస్థాన దర్శనానికి వచ్చి గోదావరిలో స్నానం చేస్తుండగా ఐదుగురు మృతి చెందడం దురదృష్టకరమని తెలిపారు. గతంలోనే నది సమీపంలో మెట్లు ఏర్పాటుచేసిన ప్రాంతం మినహా ఇతర ప్రాంతాల్లో స్నానాలు నిషేధించామని పేర్కొన్నారు.