నిర్మల్ జిల్లా భైంసా మార్కెట్లో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. శుక్రవారం సీసీఐ పత్తి ధర రూ. 7, 471, ప్రైవేటు పత్తి ధర రూ. 6, 900 ఉన్నట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. గురువారం ధరలతో పోలిస్తే సీసీఐ, ప్రైవేటులో ఎలాంటి మార్పులేదన్నారు.