గజ్జలమ్మ ఆలయంలో భక్తుల పూజలు

70చూసినవారు
నిర్మల్ జిల్లా కుంటాల ఇలవేల్పు శ్రీగజ్జలమ్మదేవి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. గురుస్వామి జక్కని గజేందర్, అర్చకుడు నగేశ్ ఆధ్వర్యంలో గజ్జలమ్మ, ముత్యాలమ్మ, మహాలక్ష్మి అమ్మవార్లకు అభిషేకం, అలంకరణ, పల్లకిసేవ నిర్వహించారు. తెలంగాణ భక్తులే కాకుండా మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఆలయానికి తరలివచ్చారు. తలనీలాలు, తులా భారంతో మొక్కులు తీర్చుకొని నైవేద్యాలు సమర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్