శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనం

75చూసినవారు
కుబీర్ మండలం రాజురా మండల పరిషత్ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరింది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు భవనం పైకప్పు నుండి నీరు కారి శ్లాబ్ పెచ్చులూడి పడుతున్నాయి. దింతో పిల్లలు గాయాలపాలవుతారేమోనని తల్లిదండ్రులు భయపడుతున్నారు. వర్షపు నీరు బయటకు వెళ్లేందుకు సదుపాయం లేకపోవడంతో నీరంతా ఆవరణలో నిలిచి పోయి బురదమయం కావడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మరమ్మతులు చేసుపట్టాలని విద్యార్థుల తలిదండ్రులు కోరుతున్నరు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్