ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పై విపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలు తగవని కుబీర్ మండల బీజేపీ అధ్యక్షుడు ఏశాల దత్తత్రి పేర్కొన్నారు. గురువారం కుబీర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడిన మాటలను వక్రీకరించి ప్రచారంచేయడం సరికాదన్నారు. పార్టీలకతీతంగా అభివృద్ధి కోసం అందరూ కలిసి రావాలని కోరారు. ఈ సమావేశంలో మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.