కొనుగోలు కేంద్రాల్లో రైతులు దోపిడికి గురవుతున్నారు: బిఆర్ఎస్

58చూసినవారు
బైంసా మండలం వానల్ పాడ్ గ్రామంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాల్లో రైతులు దోపిడికి గురవుతున్నారని బుధవారం బిఆర్ఎస్ సమన్వయ సమితి సభ్యులు విలాస్ గాదేవర్ ఆరోపించారు. పంటను అమ్ముకోవడానికి దాన్యం తీసుకురాగా తరుగు పేరిట దోచుకుంటు, క్వింటాల్ ధాన్యానికి ఏడున్నర కిలోల వరకు తరుగు పేరిట రైతుల పొట్ట కొడుతున్నారన్నారు. రైతులకు అన్యాయం జరిగితే పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్