రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెండవ విడత రైతు రుణమాఫీ సందర్భంగా ముధోల్ మండలంలోని ఎడ్బిడ్ తాండ గ్రామ రైతులు సంబరాలు జరుపుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రుల చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు. ఒకరికొకరు స్వీటు పంచుకొని ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రుణమాఫీ చేయడం చాలా సంతోషంగా ఉందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రేమ్ నాథ్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.