రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెండవ విడత రైతు రుణమాఫీ సందర్భంగా భైంసా మండలం మహాగం గ్రామంలో బుధవారం రైతులు సంబరాలు జరుపుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రుల చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు. ఒకరికొకరు స్వీటు పంచుకొని ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రుణమాఫీ చేయడం చాలా సంతోషంగా ఉందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. రైతులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.