రైతులు వరి ధాన్యం కొనుగోళ్ల ను సద్వినియోగం చేసుకొని మద్దతు ధర పొందాలని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ సూచించారు. ఆదివారం ముధోల్ మండలంలోని వడ్తలా, లోకేశ్వరం మండలంలోని కనకాపూర్, అబ్దుల్లాపూర్ గ్రామాల్లో ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏ గ్రేడ్ రకం క్వింటాల్ ధర 2320 రూపాయలు, బి గ్రేడ్ రకం 2300 రూపాయలు ఇవ్వడం జరుగుతుందన్నారు.