మహా అన్నదానం చేసిన రైతులు

85చూసినవారు
బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారికి శుక్రవారం రైతులు, గ్రామస్థుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఏటా పంటలు సాగు చేసే సమయంలో పూజలు నిర్వహించడం 102 ఏళ్లుగా ఆనవాయితీ అని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు పట్టుచీర సమర్పించారు. అనంతరం మహా అన్నదానం (ఊరి బండారా) చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు, రైతులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్