కుబీర్‌లో ఫ్రైడే - డ్రైడే కార్యక్రమం

58చూసినవారు
కుబీర్ లో శుక్రవారం ఫ్రైడే -డ్రై డే కార్యక్రమం నిర్వహించారు. సీజనల్ వ్యాధుల పట్ల ఇంటింటికి వెళ్లి ఆరోగ్య సిబ్బంది ప్రజలకు సీజనల్ వ్యాధుల గురించి అవగాహన కల్పించారు. సూపర్వైజర్ సుగుణ మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇంటి పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఇంటి పరిసరాలలో కొబ్బరి చిప్పలు, ప్లాస్టిక్ డబ్బాలు, పాత కుండలు, పనికిరాని వస్తువులను ఉంచుకోరాదన్నారు.

సంబంధిత పోస్ట్