నిర్మల్ జిల్లా భైంసా డివిజన్‌లో మంగళవారం అర్థరాత్రి నుంచి ఎడతెరపిలేని వర్షం కురుస్తోంది. ఈ వర్షాలతో పంట పొలాలు తడిసిపోవడంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. గత రెండు రోజులుగా వర్షం పడుతున్న నేపథ్యంలో, విత్తనాలు నాటే పనుల్లో రైతన్నలు బిజీగా ఉన్నారు.