చినుకు పడితే చిత్తడే

75చూసినవారు
తానూర్ మండలంలోని పలు గ్రామాల్లో రహదారులు అధ్వానంగా తయారయ్యాయి. చినుకు పడితే బురదమయంగా మారడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు కోలుర్, మోగిలి గ్రామాల రోడ్లు చిత్తడిగా మారాయి. దాంతో వాహనదారులు, పాదచారులు ప్రయాణం చేయాలంటే నరకయాతన పడుతున్నారు. అధికారులు స్పందించి రోడ్లకు మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.