నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని పలు ప్రైవేటు స్కూళ్ల బస్సులను రవాణా శాఖ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఏఎంవీఐ ధూప్ సింగ్ ఆధ్వర్యంలో శుక్రవారం బస్సులను చెక్ చేశారు. బస్సులకు ఫిట్ నెస్ తో పాటు ఫస్ట్ ఎయిడ్ బాక్సులు, ఫైర్ సేఫ్టీ వస్తువులు తప్పకుండా కలిగి ఉండాలన్నారు. సరైన పత్రాలు లేకుంటే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఆర్టీఏ అధికారుల తనిఖీలతో ప్రైవేటు స్కూల్ యజమానులు అలర్ట్ అయ్యారు.