మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ రవీందర్ హెచ్చరించారు. శనివారం కుబీర్ మండల కేంద్రంలోని వివేకానంద చౌక్ వద్ద సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీలు చేశారు. మైనర్లు నడుపుతున్న వాహనాలను పోలీస్ స్టేషన్ తరలించారు. ద్విచక్రవాహనం నడిపేవారు హెల్మెట్ తప్పకుండా వాడాలని, మద్యం తాగి వాహనాలు నడిపితే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు.