కుబీర్ మండలంలో రైతులు శనివారం రోడ్డుపై నిరసన చేపట్టారు. కరెంట్ కోతలతో రైతులు పంట పొలాల్లో పండించే పంటలకు సాగునీరు అందించేందుకు ఇబ్బందులు పడుతున్నామన్నారు. చేతికందిన పంట నీరు లేక ఎండిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నాతో దిగి వచ్చిన అధికారులు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు.