కుబీర్ మండలం పార్డి(కే) గ్రామంలో హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. శనివారం ఆంజనేయునికి గ్రామస్థులు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రధాన కూడలిలో శోభాయాత్రను ప్రారంభించారు. భజన సంకీర్తనల నడుమ శోభాయాత్ర దివ్యమనోహరంగా సాగుతుంది. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవడంతో గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. జై శ్రీరామ్. జై హనుమాన్ నినాదాలతో గ్రామంలోని వీధులను హోరెత్తించారు.