
విషాదం.. ఇంటర్మీడియట్ పరీక్ష రాస్తూ విద్యార్థిని మృతి
ఏపీలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్ష రాస్తూ ఓ విద్యార్థిని మృతి చెందింది. కడపకు చెందిన అయేషా మహీం షేక్ కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. పరీక్ష రాస్తుండగా ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లింది. వెంటనే బాలికను ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో అయేషా చికిత్స పొందుతూ మృతి చెందింది. విద్యార్థిని మృతి పై తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.