కుబీర్ మండలంలోని నిగ్వ, అంతర్ని, కస్రా గ్రామాల్లో శుక్రవారం కాంగ్రెస్ నాయకులు జైబాపు జైభీమ్ జైసంవిధాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సంధర్బంగా గాంధీ, అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలనతో గ్రామాలు అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నాయన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బషీర్, బంకబాబు, వివేక్, సందీప్, గిరిధర్, దివాకర్ తదితరులున్నారు.