నర్సరీలో మొక్కలను ఎండిపోకుండా చూడాలని ఎంపీడీఓ సాగర్ రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని పార్డి(కె) గ్రామ పంచాయతీని తనిఖీ చేశారు. గ్రామంలోని పలు కాలనీలలో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ప్రతిరోజు ఉదయం క్రమం తప్పకుండా ట్రాక్టర్ తో చెత్త సేకరణ చేపట్టాలని పంచాయతీ సెక్రెటరీ నర్సయ్యకు సూచించారు. రికార్డులను పరిశీలించి నర్సారీ నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. ఎంపీఓ మోహన్ సింగ్ తదితరులున్నారు.