నెలలు గడుస్తున్నా మొక్కజొన్న పంట సరిగ్గా పెరగక పోవడంతో రైతు ఆందోళన చెందుతున్నారు. కుబీర్ కు చెందిన లక్ష్మణ్ పటేల్ పయనీర్ కంపెనీకి చెందిన పీ 3546 మొక్కజొన్నన 7బ్యాగులను సాగు చేశాడు. పంటకు ఇప్పటికే చుంచు రావాల్సి ఉన్న ఇప్పటికీ మొలక దశలోనే కనిపిస్తుంది. నెలలు గడుస్తున్నా పంట ఎదగకపోవడంతో రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అధికారులు కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకుని నష్ట పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశాడు.