కుభీర్: ఖాళీ బిందెలతో గ్రామపంచాయతీ ముందు నిరసన

51చూసినవారు
కుభీర్ మండలంలోని నిగ్వ గ్రామంలో నీటి కొరత తీవ్రంగా వెంటాడుతోంది. గ్రామంలో బోరు మోటార్లు పని చేయక సమస్య తలెత్తింది. నీళ్లు లేక ఖాళీ బిందెలతో మహిళలు స్థానిక గ్రామ పంచాయతీ ముందు నిరసన వ్యక్తం చేశారు. నీటిని సరఫరా చేయాలంటూ నినాదాలు చేశారు. అప్పుడప్పుడు ట్యాంకర్ తో నీరు సరఫరా అవుతున్నా సరిపోవడం లేదంటున్నారు. తమ బాధలు అర్థం చేసుకొని పూర్తి స్థాయిలో నీటిని సరఫరా చేయాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్