కుబీర్: రూ. 81వేలు పట్టివేత

76చూసినవారు
కుబీర్: రూ. 81వేలు పట్టివేత
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలు విస్తృతం చేశారు. ఇందులో భాగంగా శుక్రవారం కుబీర్ మండలంలోని సిర్పెల్లి హెచ్ చెక్పోస్టు వద్ద రూ. 81, 000 డబ్బు పట్టుకున్నట్లు ఎస్ఐ రవీందర్ తెలిపారు. నరసింహ రెడ్డి అనే వ్యక్తి వద్ద నగదుకు సంబంధించిన పత్రాలు లేకపోవడంతో సీజ్ చేశామన్నారు. ఎన్నికల కోడ్ ఉండటంతో మద్యం, డబ్బులు తరలించరాదని సూచించారు.

సంబంధిత పోస్ట్