కుంటాల మండల కేంద్రంలో వీర హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై హనుమంతుని విగ్రహాన్ని ఉంచి అంగరంగ వైభవంగా శోభాయాత్రను నిర్వహించారు. శోభాయాత్రలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జైశ్రీరాం. జైజై శ్రీరాం. రామలక్ష్మణ జానకీ. జై బోలో హనుమాన్కీ అంటూ భక్తుల నినాదాలతో రామ, హనుమంతుల నామస్మరణ మార్మోగింది. ఆలయాల వద్ద అన్నదానా ఆర్యక్రమలు నిర్వహించారు.