కుంటాల మండలం అంబకంటిలో శుక్రవారం పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. సరైన పత్రాలు లేని 95 బైకులు, 2 ఆటోలను సీజ్ చేశారు. భైంసా గ్రామీణ సిఐ నైలు మాట్లాడుతూ ప్రతీఒక్కరూ తప్పనిసరిగా వారి యొక్క వాహనాలకు ఆర్‌సీ, ఇన్సూరెన్స్, మరియు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలన్నారు. అదేవిధంగా ప్రజలు సైబర్ నెరలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.