కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ కానీ రైతుల సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎంపీపీ అప్క గజ్జారాం పేర్కొన్నారు. బుధవారం కుంటాల మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన మాట తప్పారన్నారు. ఏడు నెలల వడ్డీ చెల్లిస్తేనే రుణమాఫీ చేస్తామని బ్యాంకర్లు చెబుతుండటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారని ఆరోపించారు. మాజీ ఎంపీటీసీ సుధాకర్, రైతులు ఉన్నారు.