
10 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్
AP: ఇంటర్ ఎంపీసీ, బైపీసీ రెండో సంవత్సరం ప్రాక్టికల్ పరీక్షలకు హాల్టికెట్లను ఇంటర్ విద్యామండలి విడుదల చేసింది. ప్రస్తుతం ఒకేషనల్ ప్రాక్టికల్స్ జరుగుతుండగా.. ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ప్రాక్టికల్స్ జరగనున్నాయి. వెబ్సైట్: https://bie.ap.gov.in, లేదా మన మిత్ర (వాట్సప్ నంబర్: 95523 00009) ద్వారా హాల్ టికెట్లు పొందవచ్చు.